మెగా అభిమానులకు మెగా డాటర్ కొణిదెల నీహారిక గట్టి షాక్ | Cine Talkies
181 views · Published 23 June 2016 · 2:48 · Indexed 12 October 2026
Channel: YOYO Cine Talkies · 2016 · Entertainment
మెగా కుటుంబంలోంచి తొలిసారిగా హీరోయిన్ గా ఎంట్రి ఇవ్వబోతున్న నిహారిక మాస్ అభిమానులను షాక్ ఇచ్చింది. గ్లామర్ రోల్స్ ఎట్టిపరిస్థితుల్లో చేసేది లేదంటూ తేల్చి చెప్పేసింది. తనదైన ప్రతిభతో బుల్లితెరపై మంచి మార్కులు కొట్టిన ఈ బ్యూటీ నటించిన తొలి సినిమా ఒక మనసు. ఈ చిత్రంలో నిహారిక చీరకట్టులో హోమ్లీ లుక్ లో మాత్రమే కనిపించనుంది. అయితే హోమ్లీ లుక్ వదలనంటోంది నిహారిక. భవిష్యత్ లో కూడా తను ఇలాంటి పాత్రలే చేయలనుకుంటున్నట్లు పెద్ద బాంబే పేల్చింది. మాస్ అభిమానులంతా చాలా డిజప్పాయింట్ అయ్యే విషయమే ఇది. నిజానికి నిహారిక నిర్ణయం ఊహించనిదేమి కాదు.గ్లామర్ ను ప్రదర్శించే విషయంలో నూటికి 90 మంది తెలుగు అమ్మాయిలు ఇలాగే ఆలోచిస్తారు. ప్రస్తుతం హీరోయిన్లుగా రాణిస్తున్న తెలుగమ్మాయిలది ఇదే పరిస్థితి. అంజలి,శ్రీ విద్య,ఆనంది హోమ్లీ పాత్రలకే పరిమితమయ్యారు. ఊరమాస్ అంటూ కమర్షియల్ సినిమాలు చేసే తెలుగు చిత్రసీమలో వీరికి ఎలాగూ అవకాశాలు రావు.ఒకవేళ వచ్చినా.. పక్కింటి పుల్లకూర రుచెరిగిన మన నిర్మాతలు అంతా వీజీగా తెలుగు హీరోయిన్లను తమ సినిమాల్లో పెట్టుకోవడానికి సాహసించరు. మళయాలంలో హిట్ కొట్టిన ప్రేమం మూవీనే తీసుకోండి. ఆ సినిమా చూసాక మలర్ పాత్రను ఎవరైనా మర్చిపోగలరా.. మలర్ పాత్రలో నటించిన సాయిపల్లవికి అదే తొలిసినిమా.. పైగాఆ మేకప్ లేకుండానే నటించింది. ఇప్పుడు ఇదే సినిమా నాగచైతన్య హీరోగా తెలుగులో పునఃనిర్మితమవుతోంది. ఇందులో సాయిపల్లవి పోషించిన పాత్రలో గ్లామర్ డాల్ శ్రుతిహాసన్ నటిస్తోంది. మన నిర్మాతల అభిరుచే ఇంతా. తెలుగమ్మాయిలు ఏం పాపం చేశారు. మలర్ పాత్రలో కొత్త తెలుగు అందాన్ని పరిచయం చేసే సాహసం చేయలేకపోయారు.నిహారిక ఆ పాత్ర చేస్తే సినిమాకూ ఎంతో హైప్ వచ్చేది. కానీ ఏం లాభం మన నిర్మాతలు మారరు కాక మారరు. ఈ విషయంలో ఉత్తరాదికి,దక్షిణానికి ఎంత తేడా ఉందో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలు అంతే తేడా ఉంది. అందుకే తెలుగు, తమిళ్, మలయాళం అంటూ తేడా లేకుండా ఉత్తరాది భామలు అన్ని చిత్రపరిశ్రమల్లో ఆధిపత్యం సాగిస్తున్నారు. -~-~~-~~~-~~-~- Please watch: "పూరీజగన్నాథ్ పై వేణుస్వామి | Venu Swamy Predictions on Puri Jagannath Drugs Case | YOYO Cine Talkies" https://www.youtube.com/watch?v=u831W3nKlG0 -~-~~-~~~-~~-~-
More from this channel
-
1:26
ఓ యువ హీరోతో దొరికిన సమంతా | టాలీవుడ్ లో కలకలం రేపుతున్న వీడియో | Cine Talkies
-
7:07
చుట్టాలబ్బాయి టీజర్ లాంచ్ హైలైట్స్ .....|| Aadi, Namitha Pramod, Yamini Malhotra & S.S Thaman
-
2:29
Edo Idi Idigaa Undi Song Trailer | Marala Telupana Priya Movie | Prince | Vyoma Nandi | Cine Talkies
-
1:29
Young Hero Roshan Challenging Nagarjuna || Cine Talkies
-
6:44
Lovers Park Movie Opening || Vijay Reddy || Cine Talkies
-
1:08
Janatha Garage Telugu Movie Hero Jr NTR touches Samantha Legs || Cine Talkies
-
1:19
Babu Bangaram Song Launch at RedFM by Director Maruti | Cine Talkies
-
10:35
Dandu Telugu Movie Press Meet | Cine Talkies