Rescue Operation at Rapid Pace | in Cyclone Titli Affected Areas | Idi Sangathi

873 views · Published 18 October 2018 · 11:39 · Indexed 22 September 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

తిత్లీ తుఫాను.... ఈపేరు చెబితేనే శ్రీకాకుళం జిల్లా వాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. కనీవినీ ఎరుగని ఈ విపత్తు మిగిల్చిన ఆస్తి నష్టం అంతా ఇంతా కాదు. దశాబ్దానికి పైగా కొలుకోలేని పరిస్థితి ఏర్పడింది. భీకర గాలుల ధాటికి ఏళ్లపాటు కష్టపడి పెంచుకున్న కొబ్బరి, జీడిమామిడి తోటలు గంటల వ్యవధిలో నేలకొరిగాయి. వంశధార దాని ఉపనదులు ఉప్పొంగి ఆయా పరీవాహక మండలాల్లో పంటల చిరునామాను గల్లంతు చేయడమే కాదు, జనజీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరి వంటి ఆహార పంటలు నీటిపాలయ్యాయి. మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బోట్లు, వలలు పాడవడంతో జీవనోపాధి లేకుండాపోయింది. ప్రకృతి విలయాన్ని నిరోధించడం ఎవరి వల్ల కాకపోయినా, సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయడం ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యం. ఈ విషయంలో విజయవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు సహాయ పునరావాస కార్యక్రమాల్లోనూ తనదైన చురుకుదనాన్ని పెంచింది.

More from this channel