జియో ఉచిత మొబైల్ వెనుక రహస్యం ఏమిటో తెలుసా2

3,496 views · Published 22 July 2017 · 5:34 · Indexed 22 September 2026

Channel: MOBILE WORLD TELUGU · 2017 · People & Blogs

Watch on YouTube

Hai Friends

ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన.. ఉచితంగా జియో ఫోన్లు!

రిలయన్స్ జియో ప్రకటనతో టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ మరో సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ముంబైలో రిలయన్స్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖేష్ అంబానీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ఫోన్ అని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఫోన్‌ 22 భారతీయ భాషలను కలిగి ఉంటుందని ముఖేష్ తెలిపారు. 2.4 అంగుళాల స్క్రీన్‌తో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వాయిస్ కమాండ్‌తో కూడా ఈ ఫోన్ పనిచేయనున్నట్లు వెల్లడించారు.

ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. నెలకు రూ.153 చెల్లిస్తే అన్‌లిమిటెడ్ డేటా, ఇంకా వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. మిగిలిన డేటా ప్రొవైడర్లతో పోల్చుకుంటే వాళ్లు వసూలు చేస్తున్న చార్జీలో కేవలం 3శాతం చెల్లిస్తే చాలు. ఆగస్ట్ 15 నుంచి ఈ ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫోన్లను పూర్తి ఉచితంగా ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిందిగా ఆయన సూచించారు. అయితే అది పూర్తిగా రిఫండబుల్ అని, మూడేళ్ల తర్వాత దాన్ని తిరిగి వినియోగదారుడికి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఫీచర్ ఫోన్ యూజర్లకు ఇది నిజంగా డిజిటల్ ఫ్రీడమ్ అవుతుందని ముఖేష్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
***************
జియో ఫోన్‌ కావాలి అనుకున్నవాళ్ళు ఆగస్ట్ 24వ తేదీన my jio app ద్వారా, లేదా దగ్గరలో ఉన్న JIO digital stores లో వెళ్లి ఆధారకార్డు ఇచ్చి 1500రూ,,చెల్లిస్తే,కొన్ని రోజుల తరువాత ఇస్తారు,
***************


Friends వీడియో నచ్చితే లికె చెయ్యండి ,
ఈ వీడియో ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చెయ్యండి,
మనసులో ఏమైనా అనుకుంటే కామెంట్ రాయండి 

SUBSCRIBE చేసుకోవడం మాత్రం మర్చిపోకండి,

Note:- All the pictures & Images showing in the video belongs to the Respected Owners And Not Me, Iam Not the Owner of any Picture Showed in this video.

మన చానల్ Subscribe చేయండి నచ్చితే మీ ప్రెండ్స్ కి కూడా షేర్ చేయండి.


     **Stay Connected with me**

►మరెన్ని వీడియోలను చూడాలి అనుకుంటే
     క్రింద లింక్ పై క్లిక్ చేసి మా ఛానల్ ను Subscribe చేసుకోండి ……..

►For more interesting updates Please subscribe My Channel

More from this channel