A Look On Mukhyamantri Yuva Nestham | Launched by CM | Idi Sangathi

828 views · Published 18 September 2018 · 11:56 · Indexed 30 September 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

యువతకు ఉపాధికల్పన అన్నది ఎంతో ప్రాధాన్యమైన అంశం. సరైన ఉద్యోగ అవకాశాలు లభిస్తే... వారే అభివృద్ధికి పునాదిగా నిలుస్తారు. ఇది గమనించిన ప్రభుత్వం... సరికొత్త ప్రణాళికలు రచించింది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట ప్రత్యేకంగా ఓ పథకం అమల్లోకి తెచ్చింది. వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వటంతో పాటు... నైపుణ్యాభివృద్ధికి అవసరమైన శిక్షణ అందించటమే ప్రధాన ఉద్దేశం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు... జాబ్ పోర్టల్‌ ద్వారా  తర్పీదునిచ్చి... ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. అక్టోబర్‌ 2 నుంచి ప్రారంభం కానున్న నిరుద్యోగ భృతి పంపిణీ కార్యక్రమం... యువతకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తోంది.

More from this channel