After CBI vs CBI | Now Centre vs RBI | Experts Advise Amicable Solution | Idi Sangathi

4,890 views · Published 31 October 2018 · 11:59 · Indexed 8 October 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా - కేంద్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన ఈ పెనుదుమారానికి మూలం ఎవరు? కొద్దిరోజులుగా జరుగుతున్న తీవ్ర పరిణామాల్లో చాలామందికి ఇలాంటి ప్రశ్నలు రావటం అత్యంత సహజం. ఈ విషయంలో ఇద్దరూ కారణమేననేది బ్యాంకింగ్‌రంగ నిపుణుల అభిప్రాయం. బ్యాంకింగ్‌రంగం ప్రముఖ నిపుణుడు నర్సింహమూర్తి కూడా దాదాపు అదే మాట చెబుతున్నారు. రఘురామరాజన్‌, ఉర్జిత్‌పటేల్‌ ఒంటెద్దు పోకడలు, కేంద్ర ప్రభుత్వ దూకుడు వైఖరే వివాదానికి దారి తీసి ఉండొచ్చని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ విషయంలో తొమ్మిదేళ్లుగా తనిఖీలు చేయలేదన్న కేంద్రం వ్యాఖ్యలతో ఆర్బీఐ, కేంద్రం మధ్య వివాదం నెలకొందని, RBIఅధికారులు స్థానికపరిస్థితులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని నర్సింహమూర్తి అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై రెండు వర్గాలు కూర్చుని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

More from this channel