AP Govt Seriously Puts Focus | On Women Empowerment | #IdiSangathi

1,078 views · Published 25 December 2018 · 12:28 · Indexed 13 October 2026

Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics

Watch on YouTube

స్త్రీ లేనిదే సమాజం లేదు. అయినా యుగాలుగా మహిళలపై చూపిన వివక్ష... ఆడదంటే అబలనే ముద్ర వేసేసింది. ఆ కట్టుబాట్ల సంకెళ్లు తెంచుకున్న మగువ... తెగువతో ముందడుగు వేయడం ప్రారంభించాక... ఆకాశమే హద్దుగా విజయపరంపర కొనసాగిస్తోంది. అయితే సమాజంలో వేళ్లూనుకుపోయిన అసమానతలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో చెరిగిపోలేదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం... ఎక్కడ చూసినా మహిళ తక్కువ పురుషుడెక్కువ అనే విష సంస్కృతికి చరమగీతం పాడలేదు. చాలా చోట్ల బుసలు కొడుతున్న పురుష దురహంకారాన్ని, వ్యక్తిగత ఎదుగుదలను అడ్డుకుంటున్న మహిళల ఆత్మన్యూనతా భావాలు చెరిపివేసేందుకు ఐక్యరాజ్యసమితి మూడేళ్ల క్రితమే కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది. వాటిని అందుకునేందుకు ఉషోదయ ఆంధ్రప్రదేశ్ నడుం బిగించింది.

More from this channel