PV Sindhu Breaks Finals Jinx | Seals Gold | at BWF World Tour Finals
2,158 views · Published 16 December 2018 · 8:01 · Indexed 27 September 2026
Channel: ETV Andhra Pradesh · 2018 · News & Politics
భారత స్టార్ షట్లర్ , తెలుగుతేజం పీ వీ సింధు....మరోసారి చరిత్ర సృష్టించింది. చైనా గ్వాంగ్ జౌలో జరిగిన BWF ప్రపంచ టూర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ లో టైటిల్ నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి భారత షట్లర్ గా రికార్డు సృష్టించింది. తుదిపోరులో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై వరుస గేమ్ లలో సింధు జయభేరి మోగించింది. తద్వారా మెగా టోర్నీలలో ఫైనల్ ఫోబియాను అధిగమించింది. తొలిగేమ్ లో తొలుత ఒకుహరపై సింధు స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా ఆ గేమ్ ను 21-19తో సింధు చేజిక్కించుకుంది. రెండోగేమ్ లో ఇరువురు మధ్య పోరు మొదటి నుంచి హోరాహోరీగా సాగింది. ఈ గేమ్ ను 21-17 తేడాతో నెగ్గిన సింధు విజేతగా ఆవిర్భవించింది. ఈ ఏడాది సింగిల్స్ లో సింధుకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.
More from this channel
-
4:58
TDP & YCP are in Neck to Neck Fight | A Look on Political Scenario in Tirupati
-
0:40
Puducherry CM Narayanasamy wants Supreme Court's Delhi ruling replicated in the UT
-
25:00
Pratidwani | 4th July 2018 | Full Episode | ETV Andhra Pradesh
-
4:08
AP Cabinet Expansioin | CM Chandrababu May Give Chance to Minority & SC's
-
6:55
Grahavedam | Machiraju Kiran Kumar | Thamasomajyotirgamaya | 5th July 2018 | ETV Andhra Pradesh
-
4:14
TDP MP's to Stage Protest | in Parliament | for Railway Zone
-
1:04
Andhra Pradesh | 5th July 2018 | Ghantaravam | 11 AM | News Headlines
-
1:34
Fireworks Light Up The Skies at New York | On Independence Day