BIRTHDAY SPECIAL | TIRUPATI VISAKHAPATNAM | GNT-KCG | AC DOUBLE DECKER EXPRESS | INDIAN RAILWAYS
1,565 views · Published 30 December 2018 · 3:56 · Indexed 1 October 2026
Channel: GopiRailworld · 2018 · Autos & Vehicles
****Happy Birthday AC Double Decker Express**** ***2nd Birthday Special Video*** 22118 Guntur - Kacheguda AC Double Decker Express and 22707/22708 Tirupati Visakhapatnam AC Double Decker Express History : ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 2012 రైల్వే బడ్జెట్ లో సికింద్రాబాద్ డివిజన్ కు ప్రభుత్వం రెండు డబుల్ డెక్కర్ రైళ్లు మంజూరు చేసింది. ఇందులో కాచిగూడ - తిరుపతి, కాచిగూడ - గుంటూరు వరకు వయా నడికుడి మీదుగా నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. మొదట ట్రైల్ రన్ గా కాజీపేట, డోర్నకల్ జంక్షన్ మీదుగా డబుల్ డెక్కర్ రైలు పరుగులు తీసింది. తర్వాత గుంటూరు నుండి కాచిగూడకు ట్రైల్ రన్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఆగి ఉండడంతో అప్పట్లో దానిని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ రైలులో బోగీలు వెడల్పుగా సాధారణ బోగీలకంటే ఎత్తు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ రైలులో మొత్తం 17 బోగీలు ఒక్కో బోగీలో రెండు అంతస్తులు కలిపి 120 సీట్లు ఉన్నాయి. ట్రైల్ రన్ నిర్వహిస్తున్నప్పుడు ప్రతి స్టేషన్ లోని ప్లాట్ ఫారాల మీదుగా నడిపించి పరీక్షించారు. బోగీలకు కెమెరాలను అమర్చి ప్లాట్ ఫారం, బోగీల మధ్య ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఎప్పుడెప్పుడు డబుల్ డెక్కర్ వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రయాణికులకు 13 మే 2014 మంగళవారనాడు దక్షిణ భారతదేశంలోని తొలి డబుల్ డెక్కర్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం ఉదయం 5.37 గంటలకు చరిత్రాత్మకమైన కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి గుంటూరుకు బయులుదేరింది. రైల్వే అదికారులు ఈ డబుల్ డెక్కర్ రైలును పూలతో సుందరంగా అలంకరించారు. కాచిగూడ నుండి బయులుదేరిన ఈ రైలు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగ ఉదయం 10.45 గంటలకు గుంటూరుకు చేరుకుంది. తిరుగు ప్రయాణంలో 12.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.15 గంటలకు కాచిగూడకు చేరింది. ఈ రైలు ప్రారంభం అయిన రోజు 50 శాతం ప్రయాణికులు ప్రయాణించారు. గుంటూరుకు రూ. 450 టికెట్ ధరగా నిర్ధారించారు. మంగళ, శుక్రవారాల్లో ఈ రైలు కాచిగూడ నుంచి బయులుదేరుతుంది. ఆ తర్వాత రోజు 14 మే 2014 తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే డబుల్ డెక్కర్ రైలు నడిపింది. బుధ, శనివారాల్లో కూచిగూడ నుంచి తిరుపతికి, గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడకు ఈ రైలు నడిచింది. డబుల్ డెక్కర్ వచ్చిందన్న సంతోషం కొద్దిరోజులు కూడా ప్రయాణికులకు లేకుండా పోయింది. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఈ రైలు అప్పుడు గుదిబండగా తయారయింది. అంటే గుంటూరు నుంచి కాచిగూడకు, కాచిగూడ నుంచి తిరుపతికి వారానికి రెండు రోజులపాటు తిరుగుతున్న ఈ రైళ్లోలో పది బోగీల్లో రెండు బోగీలు కూడా నిండటం లేదు. ఇవే రూట్లలో తిరిగే ఇతర రైళ్లన్నీ కిటకిటలాడుతూ ఉంటే డబుల్ డెక్కర్ రైలు సీట్లు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఈ రైలు ప్రయాణికుల ఆదరణకు నోచుకోకపోవడానికి గల కారణమేమంటే ఈ రైళ్లలో సీట్లన్నీ ఏసీ చైర్ కార్. టికెట్ ధర అదికం. తెల్లవారుజామునే బయులుదేరుతుండటం, ఆ సమయంలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉండటం, కాచిగూడ నుంచి గుంటూరు ఉదయం 5.30కు... కాచిగూడ నుంచి తిరుపతికి 6.45కు, తిరుపతి నుంచి కాచిగూడ కు ఉదయం 5.45కి. ఒక్కో రైల్లో 1200 సీట్లుంటాయి. ప్రయాణీకుల రద్దీపై అధ్యయనం చేయకుండా ఈ రైళ్లను ప్రారంభించడం. ఇంత భారీ సంఖ్యలో ఏసీ ప్రయాణికులు ఎక్కుతారా? అన్నది పరిశీలించక పోవడం వంటి కారణాలుగా చెప్పవచ్చు. చివరకు ఈ రైలును 14 నవంబర్ 2016న పూర్తిగా తిరుపతి కాచిగూడ గుంటూరు మధ్యన రద్దు చేశారు. మధ్యమధ్యలో ఈ రూట్లలో రద్దు చేస్తూ అప్పుడప్పుడు పండుగ సందర్భాల్లో విజయవాడ మీదు గుంటూరుకు స్పెషల్ ఏసీ ఎక్స్ ప్రెస్ గా కొద్ది రోజులు నడిపారు. చివరకు కొద్దిరోజుల తర్వాత సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకుని అక్కడు నుండి తిరుపతికి న్యూగుంటూరు మీదుగా ట్రైల్ రన్ నిర్వహించారు. తర్వాత కృష్ణా పుష్కరముల సందర్భంగా కృష్ణ పుష్కర స్పెషల్ ఏసీ డబుల్ డెక్కర్ రైలుగా న్యూ గుంటూరు మీదుగానే నడిపారు. చివరకు ది. 30 డిసెంబర్ 2016న Inaugural Special Run Train No. 02707 Tirupati Visakhapatnam AC Double Decker Express గా ఆరోజు విశాఖపట్నం చేేరుకుంది. ప్రస్తుతం ఈ రైలు ఆది, బుధ, శుక్రవారాల్లో తిరుపతి నుండి నడిచేవిధంగా ప్రవేశపెట్టారు. తిరుపతిలో ఈ రైలు రాత్రి 21.50 గంటలకు బయలుదేరి రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, న్యూగుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుణి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నంకు ఉదయం 11.00 గంటలకు చేరుకుంటున్నది. గుంటూరుకు డబుల్ డెక్కర్ రైలు లేకుండా పోయిందే అనుకున్న ప్రయాణికులు రైల్వే అధికారులు న్యూ గుంటూరు మీదుగా డబుల్ ఎక్స్ ప్రెస్ ను నడుపుతున్నారు. 22707 Visakhapatnam to Tirupati AC Double Decker Express will depart Visakhapatnam at 22:25hrs and arrive Tirupathi Main 11:35hrs on the next day. 22708 Tirupati Visakhapatnam AC Double Decker Express will depart Tirupati at 21.50hrs and arrive Visakhapatnam 11.00hrs on the next day. Thanks for watching! Hope you enjoy the video! Like, Comment and Subscribe for more! © GopiRailworld
More from this channel
-
0:32
Rayalaseema Express Crossing Tirupati GUDUR Passenger | Indian Railways
-
0:53
22222 ERODE WAP-4 With Coromandel SuperFast Express | Indian Railways
-
0:44
Dharmavaram to Vijayawada Express with Kazipet WDG3A | DEMU Train Crossing Dharmavaram Express | IR
-
0:37
Bangalore Cantonment to Vijayawada Passenger with GTL WDG3A | Indian Railways
-
5:21
GUNTUR - TENALI Doubling Status | Part - 5 | 21th May 2018 | Indian Railways
-
0:34
Chennai RAJDHANI Express | Lallaguda WAP-7 | 12434 Nizamuddin to Chennai Central | Indian Railways
-
0:39
Humsafar Express Train | Vijayawada WAP-4 | Howrah to Yesvantpur | Indian Railways
-
2:32
Kerala SuperFast Express | Ernakulam Patna SuperFast Express | High Speed Action | Indian Railways